ఇంట్లోనే ఉండమంటే ఊరంతా తిరిగేసాడు.. దీంతో కొన్ని వందలమందికి టెన్షన్ 

ప్రస్తుతం మనమంతా కరోనా కాలం లో బతుకుతున్నాం. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని ప్రస్థితి. ఐతే కొంత మంది మాత్రం మాకేంటి మేము ఆరోగ్యంగా బాగానే ఉన్నాము. మాకు కరోనా సోకదు అని కనీసం మాస్క్ కూడా లేకుండా తిరిగేస్తున్నారు. అదేమంటే మీ సంగతి మీరు చూసుకోండి అనే జవాబు. ఐతే ఇటువంటి వారి కోసమే ఈ వార్త.

అసోంలో ఒక కూరగాయల వ్యాపారికి కొద్ది రోజుల క్రితం దగ్గు రావడం మొదలైంది. దాంతో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెప్పగా అబ్బే కొద్దిగా వేడి చేసింది అందుకే దగ్గు స్టార్ట్ ఐంది అని తన మానాన తాను కూరగాయలు అమ్మడానికి వెళ్ళాడు. అతను కూరగాయలు అమ్ముతూ తిరుగుతుండగా అటు వచ్చిన పోలీసులు గమనించి ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే వేడి చేసి దగ్గు వస్తోందని చెప్పాడు. అతని పరిస్థితి గమనించిన పోలీసులు కరోనా పరీక్ష చేయించుకోమని చెప్పగా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు. ఐతే పోలీసులు మాత్రం ఎందుకైనా మంచిది అని ఒక టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించారు. అంతే కాకుండా మూడ్రోజులు కూరగాయలు అమ్మ వద్దని కరోనా టెస్టు రిజల్ట్ వచ్చే వరకూ ఇంట్లోనే ఉండమని పోలీస్ లు చెప్పి పంపించారు. ఐతే ఇంటికి తిరిగి వస్తూ దారిలో కూడా వెజిటబుల్స్ అమ్ముకుంటూ వెళ్ళాడు.

అంతే కాకుండా ఆ వ్యాపారి తన వద్ద ఉన్న కూరగాయలు పాడై పోతున్నాయని చెప్పి వాటిని ఎపుడు అమ్మే ఏరియా లో కాకుండా వేరే ఏరియాలో కూరగాయలు అమ్ముతూ చాల కాలనీలు చుట్టేశాడు. ఇంతలో కరోనా టెస్ట్ రిజల్ట్స్ రావడం తో పాలీసులు అతన్ని వెదుక్కుంటూ అతని ఇంటికి చేరే సరికి ఆ వ్యాపారి ఇంటి దగ్గర లేకపోవడం తో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఫోన్ చేసి అతనిని ఇంటికి రప్పించి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి చెప్పారు. ఐతే పోలీసులకు మాత్రం కొత్త టెన్షన్ స్టార్ ఐంది. టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకు ఇల్లు కదలొద్దని చెప్పినా వినిపించుకోకుండా తిరిగేసిన కారణంగా ఎన్ని వందల మందికి కరోనా అంటించేసాడో అని అటు పోలీసులు ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మనకేం కాదన్న నిర్లక్ష్యమే మన కొంపముంచుతుంది. మన నిర్లక్ష్యం కారణంగా ఎందరో బలవుతున్నారు. కాబట్టి, మనం జాగ్రత్తగా ఉంటూ.. మనల్ని, మన వాళ్ళని కాపాడుకుందాం.