అందాల బరువు పెంచిన వీణామాలిక్
Published on: Sun Nov 25, 2012 4:18PM

వీణామాలిక్ ప్రస్తుతం తెలుగులో నగ్న సత్యం అనే సినిమాలో నటిస్తుంది. కొంచెం సన్నగా ఉండే వీణామాలిక్ ను డైరెక్టర్ బరువు పెరగాలని చెప్పాడట. అంతే ఈ అమ్మడు ఏకంగా 10 కేజీలు బరువు పెరిగిందంటా. డైరెక్టర్ ఐతే ఆమె అందాలను చూసి తెగ మెచ్చుకున్నాడట.
ఇటీవల వీణా మాలిక్ హైదరాబాద్ లో అరెస్టయింది. ఆమెను పోలీసులు నేరుగా జైలుకు తరలించారు. అయితే ఏ కేసులో అని ఆరాతీయకండి. ఇదంతా కూడా షూటింగ్ లో భాగంగానే జరిగింది. నిజమయిన అరెస్టు కాదు. ఈ సీన్లో నటించిన వీణా మాలిక్...
బాప్రే... జైలు గదిలో కొద్దిసేపు నరకం అనుభవించాను. జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కొన్ని క్షణాలు అనుభవించి చూశాను. సినిమాలో జైలు జీవితం ఎలా ఉంటుందో చూపినందుకు థ్యాంక్ గాడ్ అంటూ చమటలు తుడుచుకుందట వీణా మాలిక్.


