TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

9 వర్సిటీలకు వీసీల నియామకం

Published on: Fri Oct 18, 2024 5:12PM

తెలంగాణ‌లోని 9 యూనివ‌ర్సిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్‌ల నియామకం ఫైలుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు తొమ్మిది మంది వీసీల నాయామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఉస్మానియా యూనివర్సిటీ కి ప్రొఫెసర్ ఎం.కుమార్, శాతవాహన యూనివర్సిటీకి ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, తెలుగు వర్శిటీకి  ప్రొఫెసర్ నిత్యానందరావు, మహాత్మా గాంధీ వర్సిటీకి  ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ వీసీలుగా నియమితులయ్యారు.

అలాగే తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ యాదగిరి రావు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా అల్దాస్ జానయ్య, శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజిరెడ్డి నియమితులయ్యారు.  ఇక పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్ నియమితులయ్యారు.