TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు కుమార్తె ఇంట్లో 36కోట్లు ఎక్కడవి?

Published on: Tue May 15, 2012 6:31PM

తన కూతురింట్లో దొరికిన డబ్బుకు సంబంధించి చిరంజీవి పూర్తి స్థాయి విచారణకు సిద్ధపడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం అన్నారు. చిరంజీవి వియ్యంకుడికి అంత డబ్బు నగదు రూపంలో ఉంచుకునేంతంటి వ్యాపారాలు ఏమీ లేవని ఆమె అన్నారు. ఆ కుటుంబం ఆర్థికపరంగా ఇటీవల పలు ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబం వద్ద ఇంత డబ్బు నగదు రూపంలో ఉండే అవకాశమే లేదన్నారు. చిరంజీవి అత్యవసరంగా ఢిల్లీ వెళ్లి ఈ రోజు వాయలార్ రవిని ఎందుకు కలవవలసి వచ్చిందో చెప్పాలన్నారు.