TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూతురింట్లో ఐటి దాడులపై వాయలార్‌తో చిరంజీవి చర్చ

Published on: Tue May 15, 2012 4:30PM

చిరంజీవి మంగళవారం కేంద్రమంత్రి వాయలార్ రవితో భేటీ అయ్యారు. చెన్నైలోని తన వియ్యంకుడి ఇంట్లో ఐటి అధికారుల దాడులపై, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలపై మంతనాలు జరిపారు. రవితో చిరంజీవి దాదాపు పది నిమిషాలు చర్చలు జరిపారు. బుధవారం వాయలార్ రవి రాష్ట్రానికి రానున్నారు. బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితలతో కలిసి ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచార సమయంలోనే ఆయన ఆయా నియోజకవర్గ నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఉప ఎన్నికలలో గెలుపు వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. రవి ప్రచార షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 17న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో, 18న అనంతపురంలో, 19న గుంటూరులో వాయలార్ రవి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.