TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యాట్ రద్దుపై పార్టీల హడావిడి..వ్యాపారులు ఫుల్ ఖుషీ

Published on: Sat Jan 28, 2012 10:14AM

హైదరాబాద్: వస్త్ర వ్యాపారుల కష్టంపై టీడీపీ, వైఎస్సార్‌ సీపీ వంతులవారీగా నర్సరావు పేటలో ఆందోళన నిర్వహించాయి. ఉదయం నుంచి మధ్యహ్నం వరకు టీడీపీ ధర్నా చేసుకునేందుకు, ఆతర్వాత వైఎస్సార్‌ సీపీ ఆందోళనకు అధికారులు అనుమతించారు. దీంతో.. తమ నిరనసలు విజయవంతం అయ్యేలా ఆయా పార్టీల నేతల ప్రతిష్టాత్మకంగా జనసమీకరణ చేశారు. టీడీపీలో దూకుడుగా ఉండే కోడెల ధర్నా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ప్రభుత్వ మెడలు వంచైనా వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు, ప్రజలను దోచుకునేందుకు ప్రభుత్వం ఆయా మార్గాలను వెతుకుతోందనీ, అందులో భాగంగానే వ్యాట్ పన్నుతో ముందుకు వచ్చిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాను సీఎం అయితే.. వ్యాట్‌ రద్దుపైనే తొలిరోజు సంతకం చేస్తానని పల్నాటి పోరు గడ్డపై జగన్‌ మాట ఇచ్చారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి ప్రభుత్వం ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నదన్నారు. వ్యాట్ పన్నును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి రూ. 700 కోట్లు ఖర్చు చేస్తోందనీ, సోనియా మెప్పుకోసమే మంత్రులంతా ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. అసలు జూన్, జనవరి నెలలకి తేడా తెలియని ఆనం రాంనారాయణ రెడ్డి ఆర్థికమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ఎద్దేవా చేశారు. పార్టీల మధ్య పోరు ఎలా ఉన్నా.. జగన్‌ హామీ, కోడెల దూకుడుతో తమ సమస్యకు భారీ ప్రచారం లభించినందుకు వ్యాపారులు సంతోషపడ్డారు. మరోవైపు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. కాగా, వ్యాట్‌ను రద్దుకు నిరసనగా ఏపీ వస్తవ్య్రాపార సంఘాలు సమాఖ్య ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నా ఐదో రోజుకు చేరింది. వారికి మద్దతుగా బీజేపీ నేతలు గోశాల నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.