TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాస్తవ వేదిక.. ఏపీ మద్యం కుంభకోణంలో అసలు నేరస్థులను కాపాడుతున్నదెవరు?

Published on: Thu Jan 29, 2026 5:55PM

తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక పదో సంచిక గురువారం (జనవరి 29) విడుదలైంది. ఈ సారి కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సాగుతున్న తీరుపై చర్చించారు.

వంద కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు అరెస్టయ్యారు. కానీ లక్షకోట్ల నగదు చెలామణీ వేల కోట్ల అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుభకోణం దర్యాప్తు  తాడేపల్లి ప్యాలస్ గుమ్మం దగ్గర ఆగిపోవడానికి కారణమేంటి? ఈ కుంభకోణంలో నేరస్థులను కాపాడుతున్నదెవరు? వంటి విషయాలపై నిర్మోహమాటంగా రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ ల  చర్చను  తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో వీక్షించండి.