ఇండియాలో తక్కువ ప్రభావాన్ని చూపే కరోనా సోకుతుందా?

ఆంథ్రోపాలజీ అధ్యాపకుడు వాసిరెడ్డి అమర్నాథ్ క‌రోనాపై ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను లేవ‌నెత్తారు. ఇండియా మరో ఇటలీ కాదని ఆయ‌న విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు హైదరాబాద్ లో ఒక్క రోగి కి కూడా వెంటిలేటర్ ను వాడాల్సిన అవసరం ఏర్పడలేదని తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ రెండు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. అంటే ఇవన్నీ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అన్న మాట .

సుబ్రమణ్య స్వామి, అమెరికా లోనో మరెక్కడో ఉన్న డాక్టర్ ను సంప్రదిస్తే ఆయన భారతీయులకు virulent స్ట్రైన్ కాకుండా తక్కువ ప్రభావాన్ని చూపే కరోనా స్ట్రైన్ సోకిందని చెప్పారట . సో ఆయన గారు ట్వీటారు. జనాలు దాన్ని షేర్ చేస్తున్నారు . దీని అర్థం ఏమిటంటే ఇప్పటిదాకా యాదృచ్చికం గా virulent వెరైటీ సోక లేదు కాబట్టి ఇక్కడ పరిస్థితి మెరుగ్గా వుంది . అది సోకితే ఇక హాహాకారాలే.

సుబ్రమణ్య స్వామి ట్వీట్ లో నిజమెంతో చూద్దాం. ఇప్పటిదాకా భారత దేశం లో ప్రధానంగా విదేశాలను నుండి వచ్చిన వారికే కరోనా ఎక్కువగా వచ్చింది. వారు ఇటలీ , లండన్ , స్పెయిన్ , అమెరికా , సింగపూర్ .. ఇలా పలు దేశాలనుండి వచ్చారు . ముఖ్యంగా యూరోప్ అమెరికా లో ఈ వ్యాధి విస్తృతి, ఇటలీ లాంటి చోట్ల అయితే దీని ప్రభావం అందరికి తెలిసిందే . అంటే ఇటలీ లో తెల్లవాళ్లకు virulent స్ట్రైన్ సోకింది.

మనవారికి మాత్రం పోనీలే అని తక్కువ ప్రభావాన్ని చూపే కరోనా సోకిందా ? ఇందులో ఏమైనా అర్థం ఉందా ? మన వారి పై ఇది అంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపక పోవడానికి కారణం అది కాదు .

అమెరికా లో కరోనా వ్యాధి న పడిన భారతీయుల సంఖ్య బాగా తక్కువ . దీనికి కారణం మనాళ్ళు హోమ్ quarantine చేసుకోవడం ఒక్కటే కాదు . అమెరికా యూనివర్సిటీ ల లో పాఠాలు చెప్పే స్లేట్ విద్యార్థులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటంటే ఈ వ్యాధి బారిన పడిన ఇండియన్స్ తక్కువ . వారం క్రితమే ఇప్పుడు యూనివర్సిటీ లో బోధిస్తున్న స్లేట్ పూర్వ విద్యార్ధి కి అతని పాకిస్థానీ ఫ్రెండ్స్ కు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి . వారి పై ఈ వ్యాధి చాల మైల్డ్ గా ఉండడం తో ఆసుపత్రులు కనీసం వారికీ టెస్ట్ నిర్వహించలేదు . ఇప్పుడు వారి ఆరోగ్యం మెరుగ్గా వుంది .

అలాగే అమెరికా లో నివసిస్తున్న ఆఫ్రికన్ మూలాలు ఉన్న నల్ల జాతి వారి పై కూడా కరోనా అతి తక్కువ ప్రభావాన్ని చూపుతోంది .

పై రెండు పాయింట్స్ బట్టి నిర్ధారితం అవుతున్న దేమిటంటే మలేరియా వ్యాధి సోకే ఉష్ణ మండల ప్రాంతాల్లో పుట్టిన వారికి లేదా కనీసం ఆ మూలాలు ఉన్న వారికి కరోనా రెసిస్టన్స్ వుంది . అంటే జెనెటిక్ గా మనకు పరిణామ క్రమం లో mutations ద్వారా ఈ లక్షణం వచ్చింది . అది మలేరియా నిరోధకతను సంబంధించింది . అదే ఇప్పుడు కరోనా వ్యాధి నుంచి కూడా రక్షణ కల్పిస్తోంది .

ఒక వేళా కరోనా అనేది చైన్ తయారు చేసిన బయో వెపన్ అయితే దీన్ని ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారేమో అనిపిస్తుంది . కరోనా వైరస్ చైనా లాబ్స్ నుంచి ప్రమాదవశాత్తు లీక్ అయింది అనే అభిప్రాయాన్ని తోసి పుచ్చలేము . కానీ కావాలనే చైనా దీని ప్రయోగించింది అంటే అది సరి కాదని నా అభిప్రాయం . ఒక వేళ అది వారు తయారు చేసిన బయో వెపన్ అయితే వారి దగ్గర దానికి టీకా ఉండక పోవచ్చు . కానీ దానిపై వారికి మెరుగైన అవగాహన ఉండవచ్చు . అసలు చైనా .. బయో వెపన్ అనేది కేవలం ఒక అనుమానం మాత్రమే . ప్రపంచం లో అత్యంత పవర్ఫుల్ నెట్ వర్క్ కలిగిన సి ఐ ఏ దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడాన్ని బట్టి ఈ బయో వెపన్ థియరీ కి పెద్దగా విలువ లేదని చెప్పవచ్చు.

భారత దేశం లో ఉన్న అధిక ఉష్ణోగ్రతలు కూడా ఈ వ్యాధి చాల నెమ్మదిగా ప్రబలడానికి కారణం.

ఒక వేళ ఇండియన్స్ కూడా ఇటలీ వారి లాగే కరోనా బారిన పడే అవకాశం ఉంటే .. లాక్ ఇన్ కూడా మనల్ని రక్షించలేదు . లాక్ ఇన్ పేరుతొ మోండా మార్కెట్ లో జనాలు ఒకరి పై ఒకరు పడడం.. అమీర్పేట్ , కూకట్పల్లి ప్రాంతాల్లలో హాస్టల్ విద్యార్థులు వందల్లో పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడడం , చెన్నై రైల్వే స్టేషన్ లో మొన్న కిక్కరిసిన జన సమూహం .. ఇవి చాలు .. వేల సంఖ్యలో కరోనా వ్యాధి విస్తరించడానికి .

కానీ ఆలా జరగదు .. ఎందుకంటే మనకు మైక్రో ఎవల్యూషన్ లో భాగంగా వచ్చిన మలేరియా రెసిస్టన్స్ ఇప్పుడు ఉపయోగపడుతోంది . మన పై ఈ వ్యాధి ప్రభావం చాల మటుకు మైల్డ్ గానే ఉంటుంది . ఎవరో మరీ అనారోగ్యం తో బాధ పడుతున్నవారు .. వృద్దులు ... ఇలాంటి వారి పైనే ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది . దీనికి తోడు ఇప్పుడు లాక్ ఇన్ . తొలి రెండు రోజులు కొన్ని అపశృతులు దొర్లిన మాట వాస్తవం . కారణం జనాల పానిక్ కొనుగోళ్లు .. అలాగే ప్రయాణాలు .. దీనికి తోడు ఉగాది పండుగ కొనుగోళ్లు .. పోలీస్ లు, ప్రభుత్వం చాలా బాగా పని చేస్తున్నాయి . బహుశా ఈ రోజు నుండి అన్ని సర్దుకుంటాయి . లాక్ ఇన్ అనేది బాగా పని చేస్తుంది. ఇక ఊపిరి పీల్చుకో భారత దేశమా!