TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీకాంత్ చేతిలో నాగబాబు అస్త్రం

Published on: Mon Nov 11, 2013 10:58AM

 

గతకొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడైన వరుణ్ తేజ్ సినీ రంగ ప్రవేశం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. పూరీ జగన్నాథ్, శ్రీకాంత్ అడ్డాల,క్రిష్ వంటి దర్శకుల సినిమా ద్వారా వరుణ్ తేజ్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.... వరుణ్ తేజ్ హీరోగా పరిచయమయ్యే తొలి చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడని తెలిసింది. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జీ నిర్మించనున్నాడని తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ జనవరి నెలలో ప్రారంభం కానుందని సమాచారం.