దాడి చేస్తే దుమ్ము దులిపేస్తాం..రైతులు వద్దంటే ఓకే
Published on: Thu Jan 5, 2012 11:49AM
వరం
గల్: వరంగల్‌లో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యాత్ర కొనసాగుతుందని టిఆర్ఎస్ దాడులకు దిగితే దుమ్ము దులిపేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి, తులసిరెడ్డిలపై మాట్లాడని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేవలం బాబు యాత్రను అడ్డుకోవాలని చూడటమేమిటని అయన ప్రశ్నించారు. టిడిపిపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. టిఆర్ఎస్ కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైతులు, ప్రజలు వద్దంటే తాము ఊరుకుంటామని కాని వారు బాబు కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్‌తో తమను అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. పోలవరం టెండరుతోనే కెసిఆర్ బాగోతం బహిర్గతమైందన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే కెసిఆర్ ఇక్కడ ఏం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాకుండా ఉద్యమం కొనసాగాలనేది కెసిఆర్ వ్యూహమన్నారు. కెసిఆర్, కోదండరామ్, హరీష్ రావులకు ఏమైనా జరిగితే తమదే బాధ్యత అని, విద్యార్థులకు ఏమైనా జరిగితే మాత్రం బాధ్యత వారిదేనన్నారు.


