మీ కట్నం ఎంతో చెప్పే వెబ్‌సైట్‌

posted on: Jun 1, 2018 11:18AM

 

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. dowrycalculator.com అనే ఓ వెబ్‌సైట్‌ ఉంది. మీరు అందులోకి వెళ్లి మీ వయసు, శరీర రంగు, ఎత్తు, జీతం, వృత్తి లాంటి వివరాలన్నీ నింపితే మీరు ఎంత కట్నానికి అర్హులో తెలుస్తుంది. సహజంగానే తెల్లటివారు, బాగా సంపాదించేవారు, ఎత్తున్నవారు, మంచి వయసులో ఉన్నవారు... దీని ప్రకారం 40 లక్షలకు పైగా కట్నానికి అర్హులు. ఇంతకీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నామంటే... ఈ వెబ్‌సైటు మీద మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధి విరుచుకుపడుతున్నారు. వెంటనే సైట్‌ను బ్యాన్ చేసి, నిర్వాహకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...