తెలంగాణ టీడీపీకి మరో షాక్..


రాష్టం విడిపోయిన తరువాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి బాగా లేదనే చెప్పొచ్చు. ఏదో కొన్నిసీట్లు మాత్రమే గెలిచినా..ఆతరువాత వారు కూడా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పటికే ముఖ్యనేతలు వలస బాట పట్టగా ఇప్పుడు ఉన్న ఒకరిద్దరు ముఖ్య నేతలు కూడా పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే మరో టీడీపీ నేత కూడా టీటీడీపీకి షాకివ్వనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు వంటేరు ప్రతాప్ రెడ్డి.
 ప్రతాప్ రెడ్డి రేపు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఆయన వెంట ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం.