TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సినీ నటి వాణిశ్రీ కుమారుడి మృతి పై అనుమానాలు

Published on: Sat May 23, 2020 2:01PM

సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ (36) మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత అభినయ్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నారని నిర్థారణ అయింది. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని ఫాంహౌస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 

చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న అభినయ్‌.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఏవో సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ఆయన ముభావంగా ఉంటున్నారట. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు అభినయ్‌ మృతిపై తిరుక్కళుకుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.