సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు మృతి

టాలీవుడ్ సీనియర్‌ నటి వాణిశ్రీ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ (36) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఊటీలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ్..‌ ఇంటి పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. ఆ రాత్రి కూడా తన కుమారుడితో సరదగా గడిపిన ఆయన.. తరువాత నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఆయనకు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నారు. ఆయన భార్య కూడా డాక్టరే.

అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అభినయ్ అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో నిర్వహించనున్నారు. వాణిశ్రీకి కుమారుడు హఠాన్మరణంతో చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.