TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాధాకృష్ణ ద్వంద్వ ప్రకటన ...!

Published on: Mon Apr 30, 2012 12:37PM

తన తండ్రిని చంపినవారు కాంగ్రెస్ పార్టీలో వున్నందునే తాను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ప్రకటించడాన్ని ఆయన ద్వంద్వ వభావాన్ని తెలియజేస్తోంది. రాధాకృష్ణ తొలిగా కాంగ్రెస్ పార్టీ నుంచే శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, శాసనసభ్యునిగా పోటీ చేసి విజయం సాధించినప్పుడు కూడా రాధాకృష్ణ తండ్రి వంగవీటి మొహనరంగాను చంపినవారు కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు. తన తండ్రిని చంపినవారి గురించి ఆనాడు ప్రస్తావించని రాధాకృష్ణ నేడు ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వింతగా చెప్పుకుంటున్నారు.

 

 

 

నాయకులు రాజకీయంగా ఎత్తుగడలు వేయడం సహజం. అటువంటి ఎత్తుగడలో భాగంగా రాధాకృష్ణ నేడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరడంలో తప్పులేదని, కాని తన తండ్రిని చంపినవారు కాంగ్రెస్ పార్టీలో వున్నందునే తాను వై.ఎస్.ఆర్. పార్టీలో చేరినట్టు చెప్పడం రాధాకృష్ణ లోని అపరిపక్వతను కూడా తెలియజేస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా చిరంజీవి ఏ పార్టీకి వెళితే వారంతా వెళతారానుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించడం సబబే అయినా మరీ తాను పి.ఆర్.పి.లో చేరి, ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కూడా ఇదేమాట చెబితే బాగుండేదని కాంగ్రెస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.