వంగవీటి రాధాకి గుండెపోటు కాదు.. గ్యాస్‌పోటు!
Published on: Thu Sep 26, 2024 11:28AM

శుభవార్త.. వంగవీటి రాధాకి గురువారం ఉదయం గుండెపోటు వచ్చిందన్న వార్త తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు వున్న రాధాకి సడెన్‌గా ఈ కష్టం ఏమిటీ అని చాలామంది బాధపడ్డారు. వంగవీటి రాధాను పరీక్షించిన డాక్టర్లు... ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని, 48 గంటలు అబ్జర్వేషన్లో వుంచాలని అన్నారు. అయితే తాజాగా తెలిసిన శుభవార్త ఏమిటంటే, వంగవీటి రాధాకి వచ్చింది గుండెపోటు కాదు.. గ్యాస్‌పోటు.. అదేనండీ... గ్యాస్టిక్ ప్రాబ్లమ్. ఈమధ్యకాలంలో చాలామంది గుండెపోటుని గ్యాస్టిక్ ప్రాబ్లమ్ అనుకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొంతమంది గ్యాస్టిక్ ప్రాబ్లమ్‌ని గుండెపోటు అనుకుని హడావిడి చేస్తున్నారు. వంగవీటి రాధా ఈ రెండో కోవకు చెందిన వ్యక్తి. ఆయనకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్ బాగా పెరిగిపోయి, గ్యాస్ పైకి కొట్టేయడంతో ఛాతీ నొప్పి తీవ్రంగా వచ్చింది. దాన్ని గుండెపోటు అనుకున్నారు. ఏమయితేనేం, వంగవీటి రాధా సేఫ్. ఆయన పది కాలాలపాటు హాయిగా వుండాలి.. తన తండ్రి వంగవీటి రంగా అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలి. పోనీలెండి.. ఈ ఉత్తుత్తి హార్టెటాక్ ఇష్యూ వల్ల ఆయనకున్న దిష్టిమొత్తం పోయింది. వంగవీటి రాధా భాయ్.. త్వరగా కోలుకో.. ఇక దూసుకుపో!


