కోర్టు దగ్గరే నిలదీసిన రాధా...తడబడ్డ జగన్...


గత కొద్దిరోజులుగా విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పార్టీ మార్పుపై హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాధా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని.. టీడీపీ పెద్దలతో ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని.. ఇంక డేట్ ఫిక్స్ చేయడమే తరువాయి అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ మాటలకు స్పందించిన రాధా.. ఈ మాటలను అయితే ఖండించలేదు కానీ.. కర్ర విరగలేదు.. పాము చావలేదు అన్నట్టు సామెతలాగ మాట్లాడారు. దేనికైనా సమయం రావాలని...” నా పని నేను చేసుకుని వెళ్తున్నా.. పార్టీ మారాలని భావిస్తే పక్కా ప్రణాళికతోనే వెళ్తా. నా రాజకీయ భవిష్యత్ గురించి నాకు తెలుసు. పార్టీ మారాలని భావిస్తే కంగారు పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ” అని ఆయన చెప్పారు. తనకు టీడీపీ నేతల్లో బంధువులు, స్నేహితులు ఉన్నారని, వారితో కలుస్తుంటానని... ప్రతి సంబంధాన్నీ రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. చిన్న చిన్న పదవులు ఆశించి పార్టీ మారబోనని, ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఎమ్మెల్సీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.

 

అసలు ఈ వార్తలు రావడానికి కారణం ఆయన వైసీపీ పై ఇప్పటికే అసంతృప్తితో ఉండటం.. తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. జగన్ తీరే కారణాలు. దానికి తోడు ఇప్పుడు  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో రాధా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగానే రాధా టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కోర్టుకు వచ్చిన అధినేత జగన్ తో వంగవీటి రాధా భేటీ అయ్యారు. కోర్టు దగ్గరే రాధా జగన్ ను గట్టిగా అడిగినట్టు తెలుస్తోంది. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న తనని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని రాధా నేరుగా అధినేతని అడిగారంట. అంతేకాదు.. తనకు హామీ ఇవ్వాలని రాధా గట్టిగా కోరినట్టు తెలుస్తోంది. ఏకంగా కోర్టు దగ్గరే రాధా గట్టిగా నిలదీయడంతో.. దానికి జవాబు ఏం ఇవ్వాలో కూడా తెలియక జగన్ ఇబ్బందిపడ్డాడట. అంతేకాదు... రాధా అడిగినట్టు సెంట్రల్ మీద జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకుండానే భేటీ ముగియడంతో... రాధా మరింత అసంతృప్తికి గురయ్యారట. దీంతో రాధా టీడీపీ లో చేరేందుకు వెనుకాడరన్న టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి జగన్ రాధాని బుజ్జగిస్తారా..?లేక పోతే పోని వదిలేస్తారా.. ?చూద్దాం ఏం జరుగుతుందో..