Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపైనా చర్యలు తీసుకోండి..టీడీపీ నేత అనిత
posted on: Aug 11, 2022 9:21PM
మహిళలకు రక్షణ కల్పించడంలో తాను ముందుంటానని ఏపీ సీఎం జగన్ ప్రచారం బాగానే చేయించుకున్నారు. కానీ తన ఎంపీయే ఊహిం చనివిధంగా పట్టుబడినా అదంతా కట్టుకధే అన్నట్టు జగన్ వ్యవహ రించడంపట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ అనంతపురం ఎంపీ గోరంట్లమాధవ్ న్యూడ్ వీడియో లోకమంతా చూసి నివ్వెరపో యింది. అయినా అందులో ఉన్నది నకిలీ, అదంతా మార్ఫింగ్ వ్యవ హారమని వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతయినా తమవాడు అంత దుర్మార్గానికి ఒడిగడతాడా అన్నది వారి ధీమా. కానీ అందులో కని పించినది గోరంట్ల మాధవుడే అని తప్పుల్లేకుండా అందరూ అన్నారు. కానీ అందుకు అవ కాశం లేదని వైసీపీ కితాబునిచ్చింది.
మావాడు మహా మంచివాడని చెబుతూ తప్పించుకునే యత్నం చేస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలు వస్తేగాని ఏదీ తేల్చలేమని అం టున్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు కూడా గోరంట్ల పట్ల ఎంతో ప్రేమగా ఉండడం, ఆయన్నుదీన్నించీ తప్పించడానికే పూను కున్నారని విశ్లేషకులు అంటున్నారు. కానీ విపక్షాలకు అంత అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టే చీల్చి చెండాడుతారు. అందు లోనూ ప్రజల దృష్టిలో పరువు పోగొట్టుకున్న వైసీపీ సర్కార్ సమాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం వీలుకాదని ఎస్పీ చెప్పడంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అస హనం వ్యక్తం చేశారు. గోరంట్ల న్యూడ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షకు పంపితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమైం దన్నారు.






