వంశధారలో తగ్గిన నీటిమట్టం...రబీపై ప్రభావం
Published on: Thu Mar 1, 2012 1:45PM
హైద
రాబాద్: వంశధార కాలువలో నీరు తగ్గిపోయింది. దీని ప్రభావం రబీ సాగుపై పడింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లో నీరులేక రబీ పంటలు తగ్గాయి. వంశధార కాలువపై ఆధారపడి పంటలు వేసిన వందలాదిమంది రైతులు కాలువలో నీరు అడుగంటడంతో ఆందోళన చెందుతున్నారు. వారితోపాటు వాణిజ్య పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, చౌడి తదితర పంటలు వేశారు. వంశధార నదిలో కూడా నీరు తగ్గడంతో జిల్లాలోని సుమారు వెయ్యి చెరువులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. చెరువులపై ఆధారపడి కూడా చాలామంది రైతులు సేద్యం చేస్తున్నారు. చెరువుల్లో నీరులేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పనులు లేకపోవడంతో కూలీలు చిన్నా సన్నకారు రైతులు వలసబాట పట్టారు. పశుగ్రాసం కూడా కరువయ్యింది. దీంతో పశువులను సంతల్లో విక్రయిస్తున్నారు. సాగునీతితోపాటు తాగునీటి ఎద్దడి కూడా ఈ ప్రాంతంలో ఇప్పటికే ప్రారంభమైంది.


