వల్లభనేని వంశీకి ముగిసిన వైద్య పరీక్షలు
Published on: Thu Feb 27, 2025 3:13PM
కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిసాయి. వంశీని ఎస్సీ ఎస్టీ కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో వంశీని విచారణ చేశారు. వంశీతో పాటు లక్ష్మిపతి, శివ రామకృష్ణను పోలీసులు విచారించారు. రెండో రోజు విచారణ అనంతరం వంశీకి వైద్య పరీక్షల చేసి కోర్టు కు తరలించారు. అక్కడ్నుంచి వంశీని జైలుకు తరలించారు.


