TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇటు వంశీ.. అటు బీజేపీ.. మధ్యలో చంద్రబాబు..

Published on: Wed Nov 22, 2017 3:34PM


ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇంతకీ వంశీ అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. వల్లభనేని వంశీ తన నియోజక వర్గం అయిన  గన్నవరం పరిథిలోని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకి చెందిన డెల్టా షుగర్స్ నాలుగునెలల కిందట మూసివేశారు. దీంతో దీనిపై వంశీ.. ప్రభుత్వంపై కొన్నిరోజుల నుండి సీరియస్ గా ఉన్నారు. దీన్ని మరో ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఈ ఫ్యాక్ట‌రీని ఇక్కడ నుంచి తీసేసి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని త‌ణుకుకు త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే జరిగితే తమ ప్రాంతంలోని చెరకు రైతులు నష్టపోతారని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కొన్నాళ్లుగా ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.

 

అయితే ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో అటో.. ఇటో తేల్చుకుందామని చంద్రబాబు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఉన్న సీఎంవో అధికారులు ఆయనతో అమర్యాదగా ప్రవర్తించారట. దీంతో ఆగ్రహంతో ఉన్న వంశీ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వాలని వెళ్లగా.. మరో ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకుని ఆ లెటర్‌ని చించివేశారట. ఇక కోపంతో ఊగిపోతున్న వంశీని బుజ్జగించడానికి మంత్రి లోకేశ్  కళావెంకట్రావును మద్యవర్తిగా పంపారట. మరి బీజేపీ-టీడీపీ రెండూ ప్రస్తుతానికైతే మిత్రపక్షంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారో అన్నది ట్విస్ట్... చూద్దాం మరి ఏం జరుగుతుందో.. చంద్రబాబు వంశీ కోపాన్నిచల్లార్చుతారో.. లేదో...