వల్లభనేని వంశీ.. రాజకీయ అజ్ఝాత వాసం వీడినట్లేనా?

posted on: Aug 10, 2026 11:44AM

వల్లభనేని వంశీ  రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా దూకుడు ప్రదర్శించిన వంశీ ఇప్పుడు పూర్తిగా సైలంటైపోయారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన వంశీ.. 2019 ఎన్నికల అనంతరం అప్పటి వరకూ ఉన్న తెలుగుదేశం ను వీడి వైసీపీ పంచన చేరారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఇక 2024 ఎన్నికలలో వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. జగన్ హయాంలో వంశీ వ్యవహరించిన అరాచక తీరు కారణంగా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. భూ కబ్జా ఆరోపణలు, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం, అలాగే కిడ్నాప్ బెదరింపులు వంటి కేసులు వంశీని చుట్టుముట్టాయి. అరెస్టయ్యారు. రిమాండ్ ఖైదీగా నెలల తరబడి జైల్లో ఉన్నారు. అనారోగ్యం కారణంగా బెయిలుపై బయటకు వచ్చిన తరువాత వంశీ పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. 

నియోజకవర్గంపై పట్టు కోల్పోయారు. దీంతో సొంత నియోజకవర్గంలోనే పట్టించుకునే నాథుడు లేక దాదాపు రాజకీయంగా అజ్ణాత వాసం చేస్తున్నట్టుగా రోజులు నెట్టుకొస్తున్నారు.  అటువంటి వంశీ..తాను రాజకీయంగా క్రియాశీలంగానే ఉన్నానని చెప్పుకోవడానికా అన్నట్లు..  తాజాగా వైసీపీ పిలుపు మేరకు డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనేందుకు బయటకు వచ్చారు.  ఈ సందర్భంగా వంశీ చేసిన ప్రసంగం  చాలా చాలా క్లుప్తంగా ముగిసింది. బయట కనిపించిన ఆ కాసేపు కూడా చాలా నిరాసక్తంగా, ముభావంగా కగడిపారు. గతంలో లా హడావుడి లేదు.  ఉత్సాహం లేదు. తాను రాజకీయంగా మళ్లీ క్రియాశీలం అవుతున్నానని చెప్పుకోవడానికి ఇటీవల ఆయన వరుసగా చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలు, ఇప్పుడు తాజాగా వైసీపీ నిరసనలో పాల్గొన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరు కూడా గత వంశీకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వంశీ తీరుపై పరిశీలకులు వంశీ పొలిటిల్ కెరీర్ ఇక అంతే సంగతులు అంటున్నారు.  ఆరోగ్య కారణాలా, కేసుల భయమా చెప్పలేం కానీ, పొలిటికల్ గా వంశీ పుంజుకోవడానికి ఇసుమంతైనా ఆసక్తి కనబరచటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Vallabhaneni Vamsi, Gannavaram to jail, Political carrer, political downfall,  Incognito, Gannavaram Former MLA

google-ad-img
    Related Sigment News
    • Loading...