TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ తో వంశీ భేటీ

Published on: Thu Jul 3, 2025 1:53PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు  వల్లభనేని వంశీ  ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే  తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ..  కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ణతలు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. ఇలా ఉండగా వంశీ వైసీపీకిగుడ్ బై చెప్పనున్నారనీ, రాజకీయాలకు దూరం కావాలనుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.