Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వాలెంటైన్స్ డే.. వాలెంటైన్స్ వీక్ వెనుక ఇంత చరిత్ర ఉందని మీకు తెలుసా?
posted on: Feb 13, 2026 11:05AM

వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్ హడావిడి మొదలవుతుంది. వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ, ఒకో రోజు ఒకో విధంగా ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇందులో ప్రేమ అయినా, స్నేహం అయినా, అభిమానం అయినా ఏదైనా సరే.. ఆ బంధం పట్ల ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్ వీక్ బాగా సహాయపడుతుంది. అయితే రోజ్ డే తో మొదలయ్యే ఈ హడావిడి వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
రోజ్ డే..
వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజును రోజ్ డే గా జరుపుకుంటారు. రోజ్ డే అంటే కేవలం పువ్వులు బహుమతిగా ఇవ్వడం మాత్రమే కాదు. ఇది ఎమోషన్స్ ను అంగీకరించడం అనే విషయాన్ని కూడా చాటి చెప్తుంది. ఎర్ర గులాబీలు లోతైన ప్రేమ, అభిరుచిని సూచిస్తాయి. పసుపు గులాబీలు స్నేహం, ఆనందాన్ని సూచిస్తాయి. గులాబీ రంగు గులాబీలు ఎదుటి వారిని మెచ్చుకోవడాన్ని వ్యక్తపరుస్తాయి. తెల్ల గులాబీలు శాంతి, కొత్త ప్రారంభాలను సూచిస్తాయి.
ప్రపోజల్ డే..
వాలెంటైన్స్ వీక్ లో రెండవ రోజును ప్రపోజ్ డే గా జరుపుకుంటారు. ఈ రోజు తాము ప్రేమించిన వారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది.
చాక్లెట్ డే..
చాక్లెట్ అంటే తీపిదనం, ఆనందం. ఈ రోజున ప్రేమిస్తున్న వారికి చాక్లెట్ ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రేమించిన వారితో గడిపే క్షణాలు మరింత సంతోషంగా, మరిచిపోలేనిది చేయాలని చెప్పడమే చాక్లెట్ ఇవ్వడంలో అంతరార్థం అని చెబుతున్నారు.
టెడ్డీ డే..
టెడ్డీ డే వాలెంటైన్ వీక్ లో నాల్గవ రోజు. ఫిబ్రవరి 10 న వస్తుంది. ఈ రోజున జంటలు అంతులేని ప్రేమ, స్నేహానికి గుర్తుగా టెడ్డీ బేర్‌లను ఇచ్చి పుచ్చుకుంటారు.
ప్రామిస్ డే..
ప్రామిస్ డే కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. భాగస్వామిని ఎల్లప్పుడూ బేషరతుగా ప్రేమిస్తానని వాగ్దానం చేయడమే ప్రామిస్ డే లో ఉన్న ముఖ్య భాగం. బలమైన సంబంధానికి పునాది వాగ్దానంపై ఆదారపడి ఉంటుంది. అందుకే ప్రామిస్ చేస్తారు.
హగ్ డే..
కౌగిలింత ఉద్రిక్తతలను తగ్గించి ఉత్సాహపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రేమను వ్యక్త పరిచేందుకు వాలెంటైన్ వీక్ లో ఆరవ రోజుగా హగ్ డే ను జరుపుకుంటారు. కౌలిగి ఒక భరోసా ఇస్తుందని చెబుతారు.
కిస్ డే..
వాలెంటైన్ వీక్ లో ఏడవ రోజును కిస్ డే గా జరుపుకుంటారు. ప్రేమించిన భాగస్వామికి ముద్దు పెట్టడం ద్వారా తమ ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తం చేస్తారు.
ప్రేమికుల దినోత్సవం..
చివరగా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. ఎల్లలు లేని ప్రేమను చాటిచెబుతూ జీవితాంతం ఒకరికొకరు ఉంటామని తెలియజేసుకునే రోజు ఇది. అయితే ప్రేమకు గౌరవం దక్కినప్పుడే అది విలువైనదిగా ఉంటుంది. ప్రేమను ఎప్పుడూ పరిహారం చేయకూడదు. అలాగే ప్రేమను తమ విచ్చలవిడితనానికి వాడుకోకూడదు.
*రూపశ్రీ






