TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆయన లేకపోతే మోదీ కథ 2002 లోనే ముగిసేది

Published on: Sat May 11, 2019 1:09PM

 

బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ 2002లో గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్‌ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ మారణకాండ అనంతరం జరిగిన పరిణామాలను సిన్హా శుక్రవారం మీడియా ముందు ప్రస్తావించారు. మోదీని సీఎం పదవి నుంచి తొలగించడానికి నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నిర్ణయించుకున్నారని తెలిపారు. అందుకు ఆయనతో రాజీనామా చేయించాలని అనుకున్నారట. ఒకవేళ అందుకు మోదీ నిరాకరిస్తే ఏకంగా ప్రభుత్వాన్నే రద్దు చేయాలన్న కఠిన నిర్ణయాన్ని కూడా వాజ్‌పేయీ పరిగణనలోకి తీసుకున్నారని సిన్హా తెలిపారు. కానీ అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ అందుకు అడ్డుపడడంతో ఆ నిర్ణయం అమలు చేయలేకపోయారని వివరించారు. మోదీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అద్వానీ హెచ్చరించారని యశ్వంత్‌ సిన్హా తెలిపారు. దీంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. ఆ రోజు కనుక వాజ్‌పేయి వెనక్కి తగ్గకుంటే మోదీ కథ అప్పుడే ముగిసి ఉండేదని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.