TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైభవంగా వైకుంఠ ఏకాదశి.. తెలుగునాట భ‌క్తి పార‌వ‌శ్యం..

Published on: Thu Jan 13, 2022 9:54AM

ఏపీ, తెలంగాణ‌లో వైకుంఠ ఏకాద‌శి వేడుక‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. వైష్ణ‌వ‌ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమలలో బుధవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. 1.45 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది.

తిరుమ‌ల‌లానే తెలుగు రాష్ట్రాల్లోని వేంక‌టేశ్వ‌ర ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. ఉద‌యం నుంచి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కొన‌సాగుతోంది. భ‌క్తులు ఆ దేవ‌దేవున్ని ఉత్త‌ర ద్వారం నుంచి ద‌ర్శిస్తూ పుల‌కించిపోతున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. 

తిరుమలలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్ల స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.2కోట్ల విరాళం అందజేసింది. ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామి వారి ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌చ్చారు.

గురువారం నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తిరుమలకు చేరుకున్నారు.  ఏకాదశి పురస్కరించుకుని గురువారం ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు.