TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాహన సారథి షట్ డౌన్.. స్తంభించిన ఆర్టీవో సేవలు

Published on: Tue Jun 16, 2026 3:10PM

తెలంగాణవ్యాప్తంగా రవాణా శాఖకు ఆర్టీవోకు సంబంధించిన సేవలను అందిస్తున్న వాహన్‌ సారథి  సాఫ్ట్‌వేర్ సర్వర్లు అకస్మాత్తుగా  మొరాయించింది. షట్ డౌన్ అయ్యింది. దీంతో  రాష్ట్రంలో రవాణా సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాహన్ సారథి సాఫ్ట్‌వేర్ అకస్మాత్తుగా షట్‌డౌన్ అవ్వడంతో దానికి సంబంధించిన డిజిటల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే..  ఈ సాంకేతిక వైఫల్యంపై క్షేత్రస్థాయి అధికారులు  ఈ సమస్య పరిష్కారం మా చేతిలో లేదంటూ చేతులెత్తేయడంతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు.  
గత కొంతకాలంగా సజావుగానే సాగుతున్న ఈ సాఫ్ట్‌వేర్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడానికి కారణం ఏమిటన్న క్లారిటీ అయితే లేదు.  సర్వర్ మెయింటెనెన్స్ లోపమా,  ఉన్నతాధికారుల నిర్లక్ష్యమా అనేది స్పష్టం కావడం లేదు. సాఫ్ట్‌వేర్ లాగిన్ కాకపోవడం, డేటా ప్రాసెస్ కాకపోవడంతో రోజువారీ పనులు, అప్లికేషన్ల పరిశీలన పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల వివిధ పనుల నిమిత్తం పోర్టల్‌పై ఆధారపడే సాధారణ పౌరులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వ్యవస్థను తిరిగి ఎప్పటికి పునరుద్ధరిస్తారనే దానిపై ఉన్నతాధికారుల నుండి  ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐటీ నిపుణులు, టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తే తప్ప వారథి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేలా కనిపించడం లేదు.   ప్రభుత్వం  వెంటనే జోక్యం చేసుకుని ఈ సాఫ్ట్‌వేర్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.