సినీ నిర్మాత వడ్డే రమేష్ మృతి
Published on: Fri Nov 22, 2013 8:16AM

ప్రముఖ సినీ నిర్మాత వడ్డే రమేష్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గతకొంత కాలంగా రమేష్ క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో.. ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఎర్రగడ్డలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. రమేష్ ఇద్దరు సంతానం. కుమారుడు వడ్డే నవీన్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కూతురు బిందు కోయంబత్తూరులో ఉంటున్నారు. ఆయన తెలుగు, హిందీ బాషలలో దాదాపు 30 చిత్రాలు తెరకెక్కించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటుంది తెలుగువన్.కామ్


