దానం చెప్పింది నిజమే.. కానీ కాంగ్రెస్ లోనే ఉంటా

 

తెలంగాణ సీనియర్ నేత దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన దానం, కాంగ్రెస్ లో ఒక అగ్రకుల ఆధిపత్యం ఎక్కువైందని, విహెచ్ లాంటి సీనియర్ నేతలకి న్యాయం జరగట్లేదని ఆరోపించారు.. తాజాగా ఈ విషయంపై విహెచ్ స్పందించారు.. దానం చెప్పింది నిజమే నాకు అన్యాయం జరిగింది.. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ని విడిచిపోనని విహెచ్ స్పష్టం చేసారు.. అగ్రకులాల ఆధిపత్యాన్ని అధిగమించాలి తప్ప, భయపడి పారిపోవడం మంచిపద్దతి కాదన్నారు.. అన్యాయం జరిగితే పార్టీ వేదికపైనే చర్చించాలి, నిలదీయాలి అన్నారు.. దానం పార్టీ మారడం ఆయన ఇష్టమన్న విహెచ్, తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానని.. 2019 లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తామని స్పష్టం చేసారు.