మోడీకి వీహెచ్ పంచ్.... అది కూడా తెలీదా...!

 

నిన్న జరిగిన లోక్ సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే కదా. బడ్జెట్ పై ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో నిరసనలు ప్రదరిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభలో ప్రసంగించిన మోడీ..కాంగ్రెస్ నే టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మోడీ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మోడీకి మంచి పంచ్ ఇచ్చారు. కాంగ్రెస్ వల్లే ఏపీకి ఇప్పుడు సమస్యలు వచ్చాయని... గతంలో వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదు... కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అలా జరగలేదు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ ను తిట్టిపోశారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఏపీ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అవమానించారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్యను, పీవి నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించింది అని అన్నారు.

 

ఇక ఈవ్యాఖ్యలపై స్పందించిన వీహెచ్.. మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంజయ్య వంటి దళిత ముఖ్యమంత్రిని  బేగంపేట విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించారని మోడీ గారు అంటున్నారు.. అసలు అంజయ్య ఎస్సీ కాదన్న సంగతి కూడా తెలియని ప్రధాని, ఆయన గురించి ఎందుకు మాట్లాడారని విమర్శించారు. అంజయ్య రెడ్డి వర్గానికి చెందిన వాడని, ఆయనేమీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తికాదన్న సంగతి మోదీ తెలుసుకోవాలని అన్నారు. అంజయ్య భార్య కూడా రెడ్డి వర్గం మహిళేనని అన్నారు. రాజీవ్ గాంధీ ఆయన్ను ఎన్నడూ ఇన్ సల్ట్ చేయలేదని... నిజాలు తెలియకుండా కామెంట్లు ఎలా చేస్తారని నిప్పులు చెరిగారు. పాపం మరి మోడీ గారు ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడి బుక్ అయ్యారు.