పవన్ కళ్యాణ్, కేసీఆర్ ను ఎందుకు పొగుడుతుండు...?


మరోసారి వీ హనుమంతరావు పవన్ కళ్యాణ్, కేసీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం కేసీఆర్, పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో...వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తాజాగా...వీరిద్దరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఏం చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదర్శవంతుడని పొగిడాడో వెల్లడించాలని.. వీ హనుమంతరావు అన్నారు. మీడియా ఛానల్ తో మాట్లాడిన ఆయన "తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను చూసి అడిగిండా?, ఏదీ నేరెళ్లలో జరిగిన ఇసుక మాఫియాను చూసి అడిగిండా? ఈనాడు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తానని మోసం చేసింది కనిపించిందా? లేకపోతే రైతుల రుణమాఫీ చూసిండా? ఏదీ చేయనోడిని ఆదర్శవంతుడని పొగడటమేంటి?" అని ప్రశ్నించారు.

 

వాస్తవం ఉంటే పొగడాలని, ఆయన ఇంద్రుడు, దేవుడంటే పవన్ కల్యాణ్ ను ఎలా నమ్మాలని అడిగారు. డ్రగ్స్ కేసులో చార్జిషీట్ లో ఇన్నిరోజులూ ఆగడమేంటని అడిగిన ఆయన, కెల్విన్ ను తప్పించేందుకే పవన్ వెళ్లి కేసీఆర్ ను కలిశారని ఆరోపించారు.