వీహెచ్ ధర్నా.. అరెస్ట్ చేసిన పోలీసులు

 

తనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధర్నా చేపట్టారు. హైదరాబాదులోని సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు  వీహెచ్ ను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు..కాగా రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్దకు వచ్చిన వీహెచ్ ను ఓ సీఐ అడ్డుకోగా... ఆయనపై వీహెచ్ దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలోనే, ఆయనపై కేసు నమోదైంది.