TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో వి. హనుమంతరావు దీక్ష భగ్నం

Published on: Thu May 31, 2012 2:53PM

తిరుమలలో వైయస్ జగన్ అపచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు గురువారం ఉదయం తిరుపతిలో తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టెంట్ తొలగించి, వి హనుమంతరావు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఎంఆర్ పల్లి స్టేషన్ వద్ద మౌన దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున మౌనదీక్షకు అనుమతించేది లేదని పోలీసులు విహెచ్‌కు చెప్పారు. పోలీసు స్టేషన్‌లో ఆయన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బెయిల్ ఇవ్వడానికి పోలీసులు అధికారులు సిద్ధపడినా వి హనుమంతరావు అందుకు నిరాకరించారు. జగన్ అపచారం వల్ల ఆయన వర్గానికి ఎదురు దెబ్బలు తగలకూడదని తాను మౌన దీక్షకు పూనుకున్నట్లు వి. హనుమంత రావు చెప్పారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెంట ఉన్న యువత మంగలి కృష్ణ, భాను కిరణ్ వంటివారేనని ఆయన అన్నారు.