TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

Published on: Sat Oct 4, 2025 5:57PM

 

ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. 

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వారు తెలిపారు.విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం,   అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నాది.

 ఇప్పటికే భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వంశధార, నాగవళి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది నిరాశ్రయులు అయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని  ఐఎండీ  తెలిపింది.