బీజేపీ ఎమ్మెల్యే పైత్యం.. మందు చిందు చేతిలో తుపాకులు

 

ఉత్తరాఖండ్ లోని ఖాన్ పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌. గతంలో ఓ జర్నలిస్టును చంపేస్తానని బెదిరించిన ఘటనలో క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి మూడు నెలలపాటు సస్పెన్షకు గురయ్యారు. ఇంకా ఆ గడువు పూర్తికాకముందే మరో వివాదంలో ప్రణవ్ చిక్కుకున్నారు.

ప్రణవ్ ఇటీవలే తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంతోషంలో తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ లోని ఓ హోటల్ లో ఎంజాయ్ చేశారు. మద్యం సేవిస్తూ, ఓ బాలీవుడ్ పాటకు ప్రణవ్ చిందేశారు. అయితే, మందేసి, చిందేసిన ప్రణవ్ తుపాకులను చేతిలో పట్టుకుని ప్రదర్శించడం సంచలనం రేకెత్తిస్తోంది. అంతేకాదు, అలా డ్యాన్సు చేస్తూ.. ‘ఉత్తరాఖండ్‌లో నాలాగా ఎవరూ చేయలేరు.. ఆ మాటకొస్తే దేశం మొత్తంలో నాలా ఎవరూ చేయలేరు’ అంటూ ఆయన రెచ్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.