ఎస్పీ ఓటమికి రాహుల్‌గాంధీయే కారణమా?
Published on: Sun Mar 12, 2017 11:53AM

కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే పెద్ద మైనస్ అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అది రుజువయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మునిగి.. తనతోపాటు ఎస్పీని కూడా నిండా ముంచిందని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 100కి పైగా సీట్లు ఇస్తే అందులో పది శాతం సీట్లు మాత్రమే గెలుచుకోవడమే దీనికి రుజువుగా చూపిస్తున్నారు. దీనిని బట్టే కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు పెద్ద తప్పుగా అర్థమవుతోందని అందరూ అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడటం ప్రారంభం కాగానే అఖిలేష్ యాదవ్ తన తప్పు గుర్తించిన సూచనలు కనిపిస్తున్నాయి. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. ఎస్పీ కేంద్ర కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన రాహుల్ భారీ కటౌట్ ను తొలగింపజేశారు. ఆ స్థానంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కటౌట్ ను పెట్టించారు.


