యూపీలో కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్
Published on: Mon Feb 27, 2017 9:02AM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 1.84 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు 10.77 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


