యుపీ ఎన్నికలు :ఆ నాలుగు పార్టీల పట్టు
Published on: Sun Jan 22, 2012 10:23AM
ఉత్తర్
ప్రదేశ్:దేశానికి గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీఎస్పీ, ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.ఇందుకోసం త్వరలో జరుగున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు శక్తిమేరకు హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పాసైన విద్యార్థులకు పిసి టాబ్లెట్స్, ఇంటర్ పాసైతే లాప్‌టాప్‌లు ఇస్తామని ములాయం సింగ్ నేతృత్వంలోని ఎస్పీ ఉచిత హామీని ఇచ్చింది. గతంలో ఇంగ్లీషు భాషనే వ్యతిరేకించిన ఎస్పీ నేతలు ఇపుడు ఏకంగా లాప్‌టాప్‌లే ఇస్తామనడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఎస్పీ ఇచ్చిన ఎన్నికల హామీలపై అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని ఎస్పీ అమలు చేయలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎస్పీ హామీలపై రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.భారతీయ భాషలను అపహాస్యం చేసిన కాంగ్రెస్ నేతలు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని రాహుల్ వ్యాఖ్యలపై ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార బీఎస్పీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.


