యూపిలో ఎన్నికల ప్రచారాస్రాలుగా వాజ్‌పేయి-మోడీ
Published on: Tue Jan 10, 2012 10:36AM
ఉత్తర
ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను రంగంలోకి దింపనుంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయితో , గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే.అద్వానీలతో పాటు మరికొంతమంది ఈ నేతల జాబితాలో ఉన్నారు. ఈ మేరకు, ఎన్నికల సంఘానికి భాజపా అధిష్టానం ఒక జాబితాను సమర్పించింది. ఇందులో వీరందరి పేర్లను ఆ పార్టీ పేర్కొంది.కాగా, గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీని దూరంగా ఉంచారు. బీహార్ ఫలితాలను శాసించే ముస్లిం ఓటర్లు పార్టీకి దూరం కాకుండా ఉండేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు నరేంద్ర మోడీని ప్రచారంలోకి దించారు.అయితే ప్రస్తుతం యూపీలో బీజేపీ ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జుల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న సంజయ్‌జోషికి నరేంద్ర మోడీతో ఏమాత్రం పొసగకపోవడం గమనార్హం. ఇది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.


