TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అవినీతి మంత్రులపై మాయావతి కన్నెర్ర!

Published on: Sat Dec 31, 2011 12:11PM

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తన మంత్రివర్గంలోని అవినీతి మంత్రులపై కన్నెర్రజేశారు. ఇప్పటికే అనేక మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించిన ఆమె  మరో నలుగురు మంత్రులపై వేటు వేసింది.తొలగించిన మంత్రుల్లో ఫతే బహదూర్ సింగ్, సదాల్ ప్రసాద్ అహ్మద్ ఖాన్, ఫూల్ బాబు, షాజుల్ ఇస్లామ్ అన్సారీలు ఉన్నారు. వీరందరిని తమతమ మంత్రిత్వ బాధ్యతల నుంచి తప్పించారు. వచ్చే ఎన్నికల్లో వీరు అధికార దుర్వినియోగానికి పాల్పడవచ్చన్న అనుమానంతో వీరిని తొలగించినట్టు బీఎస్పీ పార్టీ వర్గాలు తెలిపాయి.అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో వీరు పార్టీ తరపున పోటీ చేయరన్నారు. సింగ్, ప్రసాద్, అన్సారీలు లోకాయుక్త విచారణను ఎదుర్కొంటున్నారు. వీరు తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంటూ దాఖలైన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.