ఎన్నికల ప్రచారానికి రాహుల్ కు తోడుగా ప్రియాంక!
Published on: Mon Dec 26, 2011 12:14PM
న్యూ ఢిల్d
లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నారు. దేశానికి గుండెకాయలాంటి ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే యేడాది జరుగనున్నాయి.మొత్తం 403 సీట్లు కలిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నారు. ఇందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 271 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డికి 45 సీట్లను కేటాయించింది.ఈ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రారంభించగా, ఆయనకు తోడుగా సోదరి ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. వచ్చే యేడాది ప్రథమార్ధంలో ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.


