TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐదు రాష్ట్రాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

Published on: Sat Dec 24, 2011 4:37PM

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఏడు స్థానాల కోసం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నిక కమీషన్ పెండింగ్‌లో పెట్టింది. ఉత్తరాఖండ్, పంజాబ్‌లో వచ్చే ఏడాది జనవరి 30న, మణిపూర్‌లో జనవరి 28న, గోవాలో మార్చి 3న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు జరపనుంది.

 మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి 4న ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 8, 11, 15, 19, 23, 28 తేదీల్లో మిగతా విడత ఎన్నికలుంటాయి. మార్చి 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి తెలిపారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.