ఆ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవటం పెద్ద తప్పు: ఎక్స్ సీఎం కుమారుడు

 

 

దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ రోజు గోవాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభలో పార్టీని బీజేపీ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ మాత్రం బీజేపీ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ తీసుకున్న ఈ చర్య సరి కాదంటూనే .. తన తండ్రి చనిపోయాక గోవా బీజేపీ విలువలకు తిలోదకాలు ఇవ్వడం మొదలెట్టిందని మండిపడ్డారు. అయన చేసిన ఈ వ్యాఖ్యలకు బలమైన కారణాలే ఉన్నట్లుగా తెలుస్తోంది. మనోహర్ పారికర్ చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానం నుండి పోటీచేయాలని ఆయన కుమారుడు ఉత్పల్ భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేఇస్నా అటనాసియో గెలుపొందారు. దీంతో తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు పేరిట నేతలు దోహదపడ్డారని భావించారు. ఇపుడు అదే అటనాసియో బీజేపీలో చేరడంపై కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు ఉత్పల్. అంతేకాదు వచ్చే రెండేళ్లలో ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని తీవ్రంగా విమర్శించారు.