యూటి అంటే ఊరుకోం

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో హైదరాబాద్‌ను యూటి చేయాలన్న ప్రతిపాదనపై ఇక్కడి నాయకులు గుర్రుగా ఉన్నారు. అలా భాగ్యనగరాన్ని యూటి గనక చేస్తే వారి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకం అవుతుందని వారు భయపడుతున్నారు. ఈ విషయం పై మంత్రి దానం నాగేందర్‌ కూడా తీవ్రంగా స్పందించారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే చూస్తూ ఉరుకోమని ఆయన హెచ్చరించారు.గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హైదరాబాద్‌ను యూటి చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తున్న నాయకులపై మండి పడ్డారు.తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళితే ఏం చేయాలో తమకు బాగా తెలుసన్నారు. హైదరాబాద్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. యూటీ అయితే అధాకారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయని, అప్పుడు ప్రజా ప్రతినిధులుగా తాము ఏం చేయాలని నిలదీశారు. అధికారాలు కేంద్రం చేతిలో ఉండటం తమకు సమ్మతం కాదని దానం నాగేందర్ తేల్చి చెప్పారు.