TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. లేడీ బాస్ హత్య..

Published on: Tue Apr 25, 2017 10:26AM


అమెరికాలో ఈ మధ్య తరచూ కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం... అమెరికాలో ఉత్తర డల్లస్ నగరంలో ఎల్‌బీజే ఫ్రీవేలోని ఒక కార్యాలయంలో ఒక వ్యక్తి తుపాకీతో ఉన్నాడంటూ పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు   ఒక సమావేశ హాల్లో షూటర్ ఉన్నట్లు అక్కడ ఉన్నవాళ్లు చెప్పడంచో వారు వెళ్లి చూడగా...ఒక వ్యక్తి, ఓ మహిళ చనిపోయి పడి ఉన్నారు. అయితే ముందుగా మహిళను కాల్చి, ఆ తర్వాత తనను తాను అదే తుపాకితో కాల్చుకుని ఉండాలని పోలీసులు భావించారు. అంతేకాదు ఆ మహిళ అతడి సూపర్‌వైజర్ అని విచారణలో తేలింది. నిందితుడు, మృతురాలి వారసులు వచ్చి వారిని గుర్తించేవరకు వాళ్లు ఎవరన్నది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అన్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.