TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాతో శాంతి యుద్ధంలో భాగమే.. కుండబద్దలు కొట్టిన ఇరాన్.!

Published on: Sat Jul 11, 2026 9:37AM

మధ్యప్రాచ్యంలో శాంతి నీటి మీద రాతలా మారిపోయింది. శాంతి ఒప్పందం కుదిరింది.. అంతా సద్దుకుంటుందని భావిస్తుండగా ఇంతలోనే.. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్యా తాజాగా పెచ్చరిల్లిన   ఉద్రిక్తతలు మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్నాయి.  ఇరు దేశాల మధ్య గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే.. ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది.  అమెరికా  ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే..  తాము చూస్తూ ఊరుకోబోమని,  తగిన ప్రతిచర్య, ప్రతీకార దాడులూ తీవ్రంగా ఉంటాయని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. 

చర్చల కోసం ఇరాన్ తమను అభ్యర్థించిందన్న డొనాల్డ్ ట్రంప్ వాదనలను ఇరాన్  తోసిపుచ్చింది. తాము అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదని, కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రతినిధుల పర్యటనను మాత్రమే అంగీకరించామని కుండబద్దలు కొట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖతార్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇరాన్‌లో పర్యటించి సంధి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 

 అమెరికాతో యుద్ధం అనేది ఇరాన్ లొంగిపోవడంతో ఎప్పటికీ ముగిసిపోదని, తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి  సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆ దేశం విస్పష్ట ప్రకటన చేసింది.  ఒ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో జరిగిన చర్చల సమయంలోనే తమకు అమెరికాపై ఎటువంటి నమ్మకం లేదనే విషయాన్ని ఆయన ముఖం మీదే స్పష్టంగా చెప్పినట్లు పేర్కొంది.  ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రుహోల్లా ఖమేనీ మనవడు అలీ ఖమేనీ కూడా,  అమెరికాతో చర్చలు అంటే శాంతి కోసం కాదని, అది కూడా యుద్ధంలో ఒక భాగమేనని పేర్కొన్నారు.   

US Iran relations, Donald Trump ceasefire agreement, Iran warns USA, Middle East tensions 2026, Mohammad Bagher Ghalibaf, Qatar mediation Iran