TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కలకలం రేపుతున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలు..

Published on: Mon Mar 6, 2017 11:37AM

 

నేవీలో పనిచేస్తున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలు బయటకు రావడం పెద్ద కలకలమే సృష్టిస్తున్నాయి. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికా నేవీలో పనిచేస్తున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలను ఫేస్ బుక్ లో, ఇంకా ఆయా సైట్లలో లీక్ చేశారు. లీకైన ఫొటోల్లో చిన్నస్థాయి నుంచి పెద్ద హోదాల్లో మహిళ సైనిక ఉద్యోగుల ఫొటోలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పరిస్థితి గమనించిన ఉన్నతాధికారులు సత్వర దర్యాప్తును ప్రారంభించారు. కాగా అమెరికా నేవీకి సంబంధించి ఓ ఫేస్ బుక్ గ్రూప్ పేజీ ఉంది. ఇందులో దాదాపు 30 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూప్ లోనే ఈ ఫొటోలను వేలాదిగా అప్ లోడ్ చేసి.. మహిళా ఉద్యోగులు ఫొటోలతో పాటు వారి పేర్లు, ర్యాంక్ తదితర వివరాలను కూడా తెలిపినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్‌ పేజీని మూసి వేశారు.