ఆర్‌బీఐ గవర్నర్‌కు బెదిరింపులు
Published on: Sun Mar 5, 2017 3:18PM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు బెదిరింపులు వస్తున్నాయి. వెంటనే ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకోకపోతే నీతో పాటు కుటుంబసభ్యులకు హాని కలిగిస్తానని బెదిరిస్తూ నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. దీనిపై ఉర్జిత్ పటేల్ ముంబై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మెయిల్ నాగపూర్‌లోని ఓ సైబర్ కేఫ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో ముంబై సైబర్ సెల్ బృందం నాగపూర్‌కు వెళ్లి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడిని వైభవ్‌గా గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.


