TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షర్మిలకు సర్జరీ.. కనీసం స్పందించని అన్న జగన్.!

Published on: Mon Jul 27, 2026 8:59AM

 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల  అబ్డామినల్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.  ఈ విషయాన్ని షర్మిల స్వయంగా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. తాను ఆస్పత్రిలో కోలుకుంటున్న ఫొటోను కూడా ఆ పోస్టుకు జత చేశారు.  దీనిపై   పలువురు  రాజకీయ నాయకులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపారు. అయితే.. షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ మాత్రం స్పందించలేదు.   

షర్మిల తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన కీలక సమాచారాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.

అయితే, సొంత చెల్లెలు ఆసుపత్రి పాలై, సర్జరీ చేయించుకున్న విషయం తెలిసినప్పటికీ  వైసీపీ అధినేత  జగన్  పరామర్శించకపోవడం, కనీసం సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలంటూ సందేశం పోస్టు చేయడపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అదే రోజు ఉదయం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సైనికుల త్యాగాలను స్మరిస్తూ ఎక్స్‌లో  శుభాకాంక్షలు తెలిపిన జగన్.. సొంత చెల్లెలి ఆరోగ్యంపై స్పందించకపోవడంపై వైసీపీలో కూడా ఆసంతృప్తి వ్యక్తమౌతోంది.  

కుటుంబ విభేదాలు, రాజకీయ  వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. జగన్ సొంత చెల్లెలి ఆరోగ్య పరిస్థితిపై కనీస అక్కర చూపకపోవడాన్ని వైసీపీ వర్గాలే తప్పుపడుతున్నాయి.  గత కొన్ని సంవత్సరాలుగా జగన్, షర్మిల మధ్య వేభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.   జగనన్న వదిలిన బాణాన్ని అంటూ.. 2019 ఎన్నికల సమయంలో వైసీసీ విజయానికి అలుపెరుగకుండా శ్రమించి, సుదీర్ఘ పాదయాత్ర పార్టీ స్థాపన సమయం నుంచి అన్న విజయం కోసం అలుపెరగని పాదయాత్ర నిర్వహించిన షర్మిల, తదనంతర పరిణామాల్లో జగన్ తీరుతో విభేదించి సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. 

 అంతే కాకుండా షర్మిల, జగన్ మధ్య  ఆస్తుల పంపిణీకి సంబంధించిన వివాదాలు కూడా రచ్చకెరక్కాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయి.  అయితే ఆరోగ్యపరమైన పరిస్థితులు లేదా అత్యవసర సందర్భాలు ఎదురైనప్పుడు  వైరాన్ని పక్కనబెట్టి స్పందించపోవడంపై జగన్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి.    ఆసుపత్రిలో  కోలుకుంటున్న   చెల్లెలు షర్మిలను ఇప్పటికైనా  జగన్ ఫోన్ ద్వారా లేదా స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం మంచిదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ  అభిమానులు కూడా జగన్  చెల్లెలికి కనీసం ఒక మర్యాదపూర్వక పరామర్శ సందేశం పంపితే బాగుండేదని అంటున్నారు.  

urgery for Sharmila, rother Jagan doesnt even respond, CBN, LOKESH, messge, speedy, recovery