TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యూరియా కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

Published on: Fri Sep 5, 2025 5:34PM

 

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం....జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం కానీ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో యూరియా బస్తాల కోసం ఇద్దరు  మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు..పొట్టుగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయపరిచింది. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా కొట్టుకున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలను బలవంతంగా ఆపారు. 

మహబూబాబాద్ పట్టణం లోని వివేకానంద సెంటర్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు , పురుషులు ఆధార్ కార్డు జిరాక్స్ లు పట్టు కొని  పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలోనే ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు.